Warangalvoice

KCR | ఉమ్మ‌డి ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

  • బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు సిహెచ్ లక్ష్మారెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నేతలు డా. ఆంజనేయ గౌడ్, హనుమంతు నాయుడు, గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముఖ్య నేతలు:

మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, బానోత్ మదన్ లాల్, బానోత్ హరిప్రియ నాయక్, రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వర్ రావు, వనం వెంకటేశ్వర రావు, లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నేతలు:

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి. జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ సీనియర్ నేత విజయసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశన్నగారి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Brs Chief Kcr Met With Mahabubnagar And Khammam Leaders In Erravelli
Brs Chief Kcr Met With Mahabubnagar And Khammam Leaders In Erravelli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *