Warangalvoice

Kethaki Temple | కేతకి ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ హైకోర్టు జ‌డ్జిలు

  • దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వరంగల్ వాయిస్, ఝరాసంగం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జడ్జిల‌కు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పాదాచారణ చేసి గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి అభిషేకం, మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జడ్జీలకు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. జడ్జిల వెంట సంగారెడ్డి జిల్లా జడ్జి భవాని చంద్ర, జహీరాబాద్ జడ్జి శ్రీధర్, ఆర్డీవో రామ్ రెడ్డి, డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ తిరుమలరావు, ఆర్ఐ రామారావు, శేఖర్ పటేల్ లు ఉన్నారు.

Telangana Highcourt Judges Visits Kethaki Temple
Telangana Highcourt Judges Visits Kethaki Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *