Warangalvoice

టీడీపీ నేతల స్వీట్ల పంపిణీ

  • ఘనంగా టీడీపీ ఆవిర్బాభవ దినోత్సవం

వరంగల్ వాయిస్, కరీమాబాద్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించి అన్న నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలవేసి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిలువేరు రవీందర్ మాట్లాడుతూ సమాజమే దేవాలయమని నమ్మిన సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిమాయత్ నగర్ హైదరాబాద్ నగర నడిబొడ్డున ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పరిపాలనలో భాగస్వామ్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన పార్టీ వృద్ధాప్య పింఛన్, పేదవాడికి పక్కా ఇండ్ల నిర్మాణం, రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మహిళలు విద్యలు రాణించాలనే పథకాలు నందమూరి తారక రామారావు ప్రారంభించారని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులకు ఉచితంగా హార్స్ పవర్ ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. తెలంగాణలో పోలీస్ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుచేసి పాలన తీసుకువచ్చి అందించిన నాయకుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నాయకులను శాలువాతో సత్కరించారు. చిలువేరు రవీందర్, ఠాకూర్ గణేష్ సింగ్, సింగారపు దేవేందర్, రాజు, కాండ్రాతి రాజు, కాండ్రాతి చిన్న రవి, కాండ్రాతి శ్రీకాంత్, శిర బోయిన రాజు, తవటం సంపత్ కుమార్, సింగారపు మురళి, హనుమల రాజు, కందుకూరి రాజు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *