Warangalvoice

MLA Palla Rajeshwar Reddy | ‘అభివృద్ధి, సంక్షేమంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి’

  • చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన రూ.5 లక్షల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులను ఇవాళ ఏఎంసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజుతో కలిసి ప్రారంభించారు.

వరంగల్ వాయిస్, చేర్యాల : పల్లెల అభివృద్ధి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సాధ్యమవుతుందని చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సుంకరి మల్లేశంగౌడ్‌ అన్నారు. మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన రూ.5 లక్షల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులను ఇవాళ ఏఎంసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్‌ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మించేందుకు ఎమ్మెల్యే రూ.కోటి 60లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కోతి దాసు, గ్రామ ఉపాధ్యక్షుడు శనిగరం రమేశ్‌, సీనియర్‌ నాయకులు వంగాల శ్రీకాంత్‌రెడ్డి, మంతపురి సత్యనారాయణ గౌడ్‌, మాజీ వార్డు సభ్యుడు రణం ప్రశాంత్‌, సోషల్‌ మీడియా గ్రామ అధ్యక్షుడు ముచ్చాల వంశీ, నాయకులు తోళ్ల సత్యం, కోతి యేబు, కంతుల రాజు, ఎండీ అక్బర్‌, తౌట విజయ్‌కుమార్‌, చిగుళ్ల బాలరాజు, పోషయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Mla Palla Rajeshwar Reddy Focus On Villages Development
Mla Palla Rajeshwar Reddy Focus On Villages Development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *