Warangalvoice

KTR | రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దారుణం.. మండిప‌డ్డ కేటీఆర్

  • KTR | నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువ‌తిపై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువ‌తిపై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అత్యాచాయ‌త్నం నుంచి తన‌ను తాను ర‌క్షించుకునేందుకు ఓ యువ‌తి ఎంఎంటీఎస్ రైలు నుంచి కింద‌కు దూకాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ ఘ‌ట‌న తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ఘ‌ట‌న‌పై త్వ‌ర‌గా విచార‌ణ‌ను పూర్తి చేయాల‌ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు కేటీఆర్ అభ్య‌ర్థించారు. తెలంగాణ పోలీసులు, మ‌హిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా బాధితురాలికి అన్ని విధాలా అండ‌గా ఉండాల‌న్నారు. ఈ ఘ‌ట‌న రైల్వే పోలీసుల ప‌రిధిలో ఉన్న‌ప్ప‌టికీ.. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఒక మేల్కొలుపు లాంటిది అని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దారుణంగా ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.
Brs Working President Ktr Responds On Woman Molest In Mmts
Brs Working President Ktr Responds On Woman Molest In Mmts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *