Warangalvoice

ఈ క్రమంలో వీలైనంత వరకు అందరికీ పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్‌ జామ్‌, రద్దీని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.ఈసారి మహా కుంభమేళాలో ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే వాహనాలు ఆ ప్రాంతంలో ప్రవేశించకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భక్తులు ఆన్‌లైన్‌లో ముందుగా తమ వాహనాన్ని నమోదు చేసుకుని మాత్రమే పర్యటనకు రావాల్సి ఉంటుంది. ఈ చర్యకు అనుగుణంగా, వాహనాల సంఖ్యను కూడా నియంత్రించేందుకు ఇది సహాయపడుతుంది. భక్తుల రవాణా సరళతను పెంచేందుకు, ప్రయాగ్‌ రాజ్‌ నగరంలో వన్‌ వే రూట్‌ వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమైన ప్రాంతాలకు, ఘాట్ల దగ్గరకు వెళ్లే దారులను ఒకవైపుగా మార్చి, మరో వైపు నుంచి రాకపోకలను పూర్తిగా వేరే రూట్లతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా భక్తుల రవాణా మరింత సురక్షితంగా, సమర్థవంతంగా ఉండాలని ప్రభుత్వం ఆశిస్తోంది. మహా కుంభమేళాలో ఇతర సంవత్సరాల్లో వీఐపీ పాస్‌లు ఇచ్చి, ముఖ్య అతిథులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుండగా, ఈసారి యూపీ ప్రభుత్వం ఒక సంచలనం నిర్ణయం తీసుకుంది. ‘వీఐపీ పాస్‌లు’ ఇకపై ఇవ్వడం లేదని ప్రకటించారు. ఈ విధానం ద్వారా వీఐపీలు, సర్వసాధారణ భక్తులకు సమానమైన అవకాశం కల్పించబడుతుంది. ఈ నిర్ణయం వల్ల ప్రజల మధ్య అసమానతలు తగ్గిపోతాయని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాక ఇందులో వీఐపీ పాస్‌ల ద్వారా ఏర్పడే అనవసరమైన రద్దీని కూడా తొలగించాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతీ సంవత్సరం కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటూ తమ ఆధ్యాత్మిక మొక్కులను తీర్చుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *