Warangalvoice

కేహెచ్ సీ – 172 హైబ్రీడ్ బీజీ 2 బంపర్ పత్తి విత్తనాల వాడకం ఎంతో మేలు

వరంగల్ వాయిస్, వరికోలు : స్థానికి నడికుడ మండలం వరికోలులో కావేరీ సీడ్స్ కంపెనీ వారు బుధవారం రోజున కేహెచ్ సీ – 172  హైబ్రీడ్ బిజీ బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి పంట పొలంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను చాలా కాలంగా కావేరీ కంపెనీ వారి బంపర్ ప్రత్తి రకం విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందినానని తెలియజేసారు. ఈ కార్యక్రమం సంబర్భంగా రైతులు అడిగిన పలు సందేహాలకు  కంపెనీ ప్రతినిధి జి. నితిన్ వివరణ ఇస్తూ.. ప్రస్తుత ప్రత్తి సీజన్ లో రైలుకు బంపర్ ప్రతి రకం విత్తనాలు వరదాయకమని, ఈ రకం విత్తనాలు మిగితా కంపెనీ విత్తనాలకంటే అధిక దిగిబడిని ఇవ్వడమేకాక, చీడపీడలు పంటకు ఆశించవని, రసం పీల్చే పురుగులు పట్టదని, అంతే కాకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెట్ట వాతావరణంలో కూడా తట్టుకొని చక్కటి దిగుబడినిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రం నుండి 100 మందికి పైగా రైతులు పాల్గాని కావేరీ బంపర్ ప్రతి రకం విత్తనాలపై సంతృప్తి చెందినారు. రైతలతో పాటు మెన్ సాంటో కంపెనీ లక్ష్మీనారయణతో పాటు కావేరీ కంపెనీ ప్రతినిధులు  లెనిన్, రంజిత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

kaveri_seeds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *