
వరంగల్ వాయిస్, వరంగల్ : గొర్రెలు, మేకలు అనారోగ్య నివారణకు, నీలి నాలుక వ్యాధిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా బ్లుటంగ్ వాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం వేయించడం జరుగుతుందని, దీన్ని గొర్రెలు, మేకల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. పశు వైద్యశాల డాక్టర్ ఝాన్సీ అధ్వర్యంలో శుక్రవారం ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు మందులను పంపిణీ చేసి, గొర్రెలకు ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలోని పశు సంపద గొర్రెలు, మేకలు పెంపకానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య. హసీనా, వినయ్, గొట్టే రాజమ్మ, పిట్ట శ్రీనివాస్, సుంకరి నరేష్ ఉన్నారు.