Warangalvoice

సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్ట్

  • పోలీసుల అదుపులో 15 మంది
  • పరారీలో మరో ఐదుగురు
  • వివరాలు వెల్లడించిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా
  • ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
వరంగల్ వాయిస్, క్రైం : రెండు వేర్వేరు సంఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్లను తయారు చేసున్న రెండు ముఠాలకు సంబంధించిన 15 మంది కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్, హనుమకొండ, మిల్స్ కాలనీ, కేయూసీ పోలీసులు, ఆర్టీఏ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల నుంచి ఆరు డెస్క్ టాప్ కంప్యూటర్లు, రెండు ల్యాప్ టాప్ లు, రెండు థర్మల్ ప్రింటర్స్, 17 సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ చిఫ్ తో కూడిన పీవీసీ కార్డులు, కార్డు ప్రింటింగ్ కు అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో హనుమకొండకు చెందిన ఎండి.ఆసిఫ్ ఖురేషి, వడ్లకొండ శ్రీనివాస్, లేబర్ కాలనీకి చెందిన ఎండి.నవాబ్, ఎల్.బి నగర్ కు చెందిన ఎండి.సాబీర్, హనుమకొండ నయీంనగర్ కు చెందిన మణికంటి  ప్రభాకర్ రెడ్డి, కాపువాడకు చెందిన గుగ్గిళ్ళ చెర్రిబాబు, గుడిబండల్ కు చెందిన కెషోజు రాజ్ కుమార్ అలియాస్ డీఎల్ రాజు, ధర్మసాగర్ కరుణావురంకు చెందిన ఎండి.ఆసిఫ్, ధర్మసాగర్ కు చెందిన అంకం శ్రీనివాస్, హనుమకొండ సుధానగర్ కు చెందిన గొనెల రమేష్ అలియాస్ వాగ్దేవి రమేష్, ఖిలా వరంగల్ కు చెందిన ఎన్.శశివర్ధన్, కరీమాబాద్ కు చెందిన నరిశెట్టి రాజేష్, శాయంపేటకు హవేలి, గీసుగొండ చెందిన తండ దిలివ్ కుమార్,  నక్కలపల్లి కి చెందిన ముజ్జిగ ఓంప్రకాశ్, ఫాతిమానగర్ కు చెందిన ముషిపట్ల అక్షయ్ కుమార్ అను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితులు లక్ష్మమ్మ, సతీష్, వేల్పుల ప్రశాంత్,  దేవులపల్లి శ్రావణ్, మామిడి రాజు @ భూపాలపల్లి రాజుగా గుర్తించారు. పట్టుబడిన నిందితుల్లో అధికశాతం ఆర్టీఓ బ్రోకర్లు, వాహన కన్సల్టెన్సీ యజమానులేనని సలీమా పేర్కొన్నారు.
రెండు వేర్వురు సంఘటనల్లో హనుమకొండ పోలీసులు ఆరుగురుని అరెస్టు చేయగా, మిల్స్ కాలనీ పోలీసులు మరో ఆరుగురుని, కేయూసీ పోలీసులు ముగ్గురుని అరెస్టు చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా తెలిపారు. ఈ రెండు సంఘటనల్లో నిందితులు బోగస్ రిజిస్ట్రేషన్ కార్డ్స్, బోగస్ బీమా పత్రాలను అందజేయడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని పేర్కొన్నారు. అలాగే ఆర్టీఓ విభాగానికి సంబంధించి ఎవరైన ఉద్యోగులు నిందితులకు సహకరించానే కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. కాగా నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచన వరంగల్ ఏసీపీ శుభంప్రకాశ్, హనుమకొండ ఏసీపీ నర్సింహరావు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూధన్‌, ఇన్స్‌స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్, బాబులాల్‌, పవన్ కుమార్, కేయూసీ, మిల్స్ కాలనీ, హనుమకొండ ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్‌, రమేష్, శివకుమార్‌ తో పాటు, టాస్క్‌ఫొర్స్‌ పోలీసులు, ఎస్సైలు, ఇతర పోలీస్‌ సిబ్బందిని సలీమా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *