
వరంగల్ వాయిస్, దామెర: వరంగల్ పోలీస్ కమీషనరేట్ దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన సంఘటనలో మానవత్వంతో ఎస్సై అశోక్ వ్యవహరించిన సమయస్ఫూర్తిని మండల ప్రజలు సెల్యూట్ దామెర పోలీస్ అంటూ ఆదివారం ప్రశంసల జల్లును కురిపించారు. వివరాల్లోకెళ్తే దామెరలోని శివాలయం వద్ద పోచారం గ్రామానికి చెందిన మనోహర్ తన ద్విచక్ర వాహనంపై హనుమకొండ వైపు వెలుచుండగా దామర గ్రామంలోకి రాగానే టూ వీలర్ కి అడ్డంగా కోతి రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో రోడ్డు పై మనోహర్ పడడంతో తలకి బలమైన గాయం కావడంతో అటుగా దామెర ఎస్సై కొంక అశోక పెట్రోలింగ్ కోసం వెళ్తూతుండగా గమనించి వెంటనే 108 కి ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో స్వయంగా తన వాహనంలో గాయాలైన వ్యక్తిని తీసుకొని ఆరెపల్లి వరకు వెళ్లగా 108 వాహనం రావడంతో బాధితున్ని అందులో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ఎస్సై అశోక్ ని గ్రామ ప్రజలు, పలువురు నాయకులు ప్రశంసించారు.

