Warangalvoice

వ్యక్తి నిర్మాణమే ఆర్ఎస్ఎస్ సంఘ లక్ష్యం


వరంగల్ వాయిస్  దామెర:
ఆర్.ఎస్.ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా   హనుమకొండ జిల్లా దామెర మండల శాఖ దుర్గం పేట గ్రామ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్  శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిన సందర్భంగా  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  నాయిని  సంపత్ రావు
ఆర్.ఎస్.ఎస్ వరంగల్ విభాగ్ బాధ్యులు  రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంపత్ రావు  మాట్లాడుతూసమాజ అభివృద్ధికి ఆర్.ఎస్.ఎస్ లాంటి స్వచ్ఛంద సంస్థ ప్రతి గ్రామంలో అవసరం ఉందని ప్రతి ఒక్కరూ సంఘంలో చేరి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు  కావాలని పిలుపునిచ్చారు. లక్ష్మణ్ సుధాకర్ మాట్లాడుతూ అనైక్యత కారణంగానే భారత్ అనేక శతాబ్దాలపాటు బానిసత్వంలోకి  నెట్టి వేయబడిందని. మన చరిత్రను తెలుసుకొని, స్ఫూర్తిని మేల్కొలిపి,  ఏకాగ్రతను సాధించడం ప్రతి స్వయంసేవకుడి బాధ్యత అని పేర్కొన్నారు. వ్యక్తి నిర్మాణమే సంఘ ప్రధాన లక్ష్యం  అని ఆయన తెలిపారు.
1925లో డా. హెడ్‌గేవార్ ప్రారంభించిన స్వయంసేవక్ సంఘము విశ్వకల్యాణం కోసం పర్యావరణ పరిరక్షణ, కుటుంబ విలువల సంరక్షణ, నైతిక జీవన విధానం, స్వదేశీ ఆచరణ, సామాజిక  సామరస్యత అనే ఐదు అంశాలను ఆచరించాల్సిన అవసరం ఉందని ఉద్బోధించారు. వీటిని ఆచరిస్తే సమాజంలో మార్పు సాధ్యమై, దేశంలో శాంతి, సుఖ సమస్యలు నెలకొంటాయని తెలిపారు.
కార్యనిర్వహణ గండు పరుశురాం, ముఖ్య శిక్షక్ విగ్నేష్,ఉప మండల   ప్రముఖ ముఖేష్, నవీన్, ప్రశాంత్,సృజన, అర్జున్,గోపీచంద్, నూకల రవి, అన్వేష్, బొల్లు సమ్మిరెడ్డి, నాన బోయిన రాజాలు, శరన్, శివ,కిరణ్, లక్ష్మణ్, కొట్టే రమేష్,మనోజ్,రాజు,శ్రీశైలం,గోగుల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *