
ఒకరికి తీవ్ర గాయాలు
ఎదురెదురుగా ఢీకొన్న బైకులు
వరంగల్ వాయిస్, ఆత్మకూరు : మండలంలోని దుర్గపేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం రెండు బైక్‌లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఆరూరి అశోక్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దామెర మండల బీజేపీ పార్టీ అధ్యక్షడు రాజ్ కుమార్ ను స్థానికులు హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.