
వరంగల్ వాయిస్, దామెర: పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం దామేశ్వరాలయంలో అభిషేకం, అర్చన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ పరకాల ప్రదాత రేవూరి ప్రకాష్ రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో సోమవారం బస్టాండ్ సెంటర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం హనుమాన్ దేవాలయం దగ్గరలోని కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.