
వరంగల్ వాయిస్, దామెర : దామెర మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దామేశ్వరాలయంలో అభిషేకం అర్చన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు.
రక్తదాన శిబిరం
మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద గల కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎంపీడీవో గుమ్మడి కల్పన, ఎస్సై కొంక అశోక్, ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం ఇతరులకు ప్రాణదానం అన్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి రక్త కణాల పునరుత్పత్తికి ఉపయోగపడుతుందని ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం బిల్లా రమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటూ ఈ రక్తదాన శిబిరంలో సుమారు30 నుండి50 మందికి పైగా రక్తదానం చేసినట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షపతి పోలె పాక శ్రీనివాస్, సదిరం పోశయ్య, జక్కుల రవీందర్, దుబాసి రాజేందర్, దామెర శంకర్,రాస మల్ల కిరణ్,శనిగరపు సుధాకర్, కూనమల్ల రవీందర్ తదితర కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.