Warangalvoice

రంగసాయిపేటలో బీరన్న బోనాలు

వరంగల్ వాయిస్, రంగసాయిపేట : ఈరోజు రంగసాయిపేటలో ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ బిరన్న దేవస్థానంలో బోనాల జాతర జరిగినది. ఆలయానికి ప్రధాన పూజారి మండల నర్సింహా రాములు, కుటుంబ సభ్యులతో ఆలయానికి పూజా సామాన్ల గంప నెత్తిపై ధరించి ఆలయానికి కురుమ కళాకారులు డప్పు చప్పులతో కళాకారులు ఆలయానికి విన్యాసాలు చేస్తూ ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ఆలయ పూజారి స్వామివారి లింగాలను పాలాభిషేకం పసుపు బండారి తో అలంకరించారు స్వామివారి కంకణాలు పసుపు బండారి మరియు గొర్రె పాలతో కంకణాలకు అభిషేకం చేశారు. స్వామివారి గద్దె మీద పెట్టి నైవేద్యం పళ్ళు పెట్టి స్వామివారికి చూపించారు. పూలతో అలంకరణ అఖండ దీపం వెలిగించి టెంకాయ కొట్టి గుమ్మడికాయ తో ఆలయానికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మంగళ హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు కంకణాలు భక్తులకు ఆలయ పూజారి ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక వైద్య నిపుణులు డాక్టర్ కె చంద్రశేఖర్, ఆర్య డాక్టర్ రాజేశ్వరి, కుల సంఘ గౌరవ అధ్యక్షులు మండల సీతారాములు అధ్యక్షులు, మండల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిగిరి కుమారస్వామి, ఆలయ అధ్యక్షుడు చిగిరి పూర్ణచందర్, మండల చిరంజీవి నంద రమేష్, డోలు కళాకారులు మండల శివ, బుడిమి రాజు గౌడ , కుమారస్వామి, మండల రజనీకాంత్ ,మండల ధీరజ్ తదితరులు అనంతరం నాలుగు గంటలకు రంగసాయిపేటలోని కురుమ కులస్తులైనటువంటి నివాసం నుండి మహిళలు బోనాలతో బయలుదేరారు. కురుమ డోలు కళాకారులు వీధుల నుండి విన్యాసాలు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తూ విన్యాసం చేశారు. స్థానిక ప్రజలు కురుమ కుల బోనాలు చూస్తూ డబ్బు చెప్పుల విన్యాసాలు చూస్తూ కేరింతలు కేకలు వేస్తూ ఆనందపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బిజెపి నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందనా పూర్ణచందర్, కెడల జనార్ధన్ కొంత మోహన్, కర్ర కుమార్ రెబ్బ రమేష్ శివ కళాకారుల బృందం తదితరులు పాల్గొన్నారు.

Beeranna Bonalu
Beeranna Bonalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *