Warangalvoice

భాజాపాలోకి నవనాయకుడు

  • సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఉవ్వీళ్లు
  • గ్రామాల్లో పర్యటిస్తూ యువకుల్లో చైతన్యం నింపుతున్న నేత
  • త్వరలో పార్టీలో చేరేందుకు రంగం సిద్దం

వరంగల్ వాయిస్, డోర్నకల్ : డోర్నకల్ బీజేపీలో మరో ముఖచిత్రం ఆవిషృతం కాబోతోంది. డోర్నకల్ మండలం చాంప్లతండా గ్రామ పంచాయతీలోని ధరావత్ తండాకు చెందిన విద్యావంతుడు, వ్యాపార వేత, నవ యువ నాయకుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దేశ ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలు, హిందుత్వ భావజాలంతో భాజపాలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జూలై నెల చివరిలో కాని వచ్చే నెల మొదటి వారంలోకాని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మేల్యే స్థానాన్ని భాజాపా అభ్యర్దితో భర్తీ చేయడమే లక్ష్యంగా పార్టీని సంస్దగతంగా బలోపేతం చేసేందుకు సదరు యువకుడు కాషాయం పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నాయకులను కలిసి తాను పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత ప్రధానిగా మోదీ ఇప్పటికే మూడు పర్యాయాలు బాధ్యతలు చేపట్టడంతోపాటు నాలుగో సారి కూడా బీజేపీ విజయం సాధించి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి నెహ్రూ, ఇందిరా గాంధీ రికార్డులను బద్దలు చేసేందుకు సంసిద్ధులౌతున్నట్లు సదరు యువ నాయకుడు చెప్పుకొస్తున్నారు. ఈ సమయంలో దక్షిణాదిన కూడా అత్యధికగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ ఊవ్వీళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో హిందుత్వాని, దేశ భక్తిని వంటికిబట్టించిన ఈ యువ నాయకుడు రాజకీయ అరంగెట్రం ఒక సంచలనంగా మారనుంది. తన సోంత మండలం నుంచి రాజకీయాలు ప్రారంభించి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే డోర్నకల్ నియోజకవర్గంలోని ఆయా మండలాలు పర్యటిస్తూ భాజాపా కార్యకర్తలను కలుస్తూ మోదీని నాలుగోసారి ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. తన ప్రచారాన్ని కూడా ఇప్పటికే గ్రామ స్థాయిలో మొదలుపెట్టారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యువకులల్లో దేశభక్తిని నూరిపోసి రాజకీయలద్వారా పదవులు అందుకొని ప్రజాసేవ చేయాలని పిలుపునిస్తున్నాడు. కాంగ్రెస్ ను నమ్మి చిత్తైన ప్రజలు భాజాపా అభ్యర్దులను గెలిపించి గ్రామాల్లో స్వరాజ్యం నిర్మించాలని సూచిస్తున్నాడు. భాజాపా అభ్యర్దులుగా సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ వంటి పదవులు అందుకొని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించి తరించాలని కోరుతున్నారు. నూతనంగా ఓటు హక్కు పొందిన యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో సదరు యువ నాయకుడికి నియోజక ప్రజలు జేజేలు పలికే అవకాశం మెండుగా ఉంది.
============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *