
వరంగల్ వాయిస్, వరంగల్ : బీహార్ లో రానున్నది ఇండియా కూటమేనని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.మంగళవారం బీహార్ సుపాల్ లోని నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ…20 ఏళ్ల ప్రజా కంటక నితిష్ బీజేపీ పాలన నుంచి బీహారిలకు విముక్తి లభించ బోతున్నదని ఎంపీ కడియం కావ్య అభిప్రాయ పడ్డారు. ఓట్ చోరి సార్ ఊతంగా దొడ్డి దారిన గద్దెను ఎక్కాలని కలలు కంటున్న ఎన్ డిఏ బ్యాచ్ కు శంకర గిరి మాన్యాలు తప్పవని ఎంపీ అన్నారు. బీహార్ మిథిలాంచల్ ప్రాంతంలో సుపాల్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ అధికార యాత్ర కు వస్తున్న విశేష స్పందనపై విషయాలను ప్రస్పుటం చేస్తోందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజల్లో ఆగ్రహం, యువత ఆక్రోశం, మహిళల ఆవేదన తమకు యాత్ర లో
స్పష్టంగా కనిపించిందని తెలిపారు.బీహార్ లో రాబోయే మార్పు దేశ రాజకీయ భవిష్యత్తు కొత్త తరానికి నాందిగా నిలుస్తుందని అన్నారు.అనంతరం బిహార్ లో జరుగుతున్న ఓటర్ అధికార్ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి వివిధ రాష్ట్రాల మహిళ ఎంపీల బృందంతో డాక్టర్ కడియం కావ్య యాత్రలో పాల్గొని అక్కడి ప్రజలతో ఎంపీ మమేకమై వారి సమస్యలను అక్కడ మారుతున్న రాజకీయ వాతావరణాన్ని అడిగి తెలుసుకున్నారు.స్థానికులు వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య తో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాకు ఉద్యోగాలు కావాలి కానీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తోందని అక్కడి యువత తెలిపారు.ఈ సందర్బంగా ఒక ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ నితీష్ ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని ఇప్పుడు కొత్త మార్పు కావాలన్నారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ బీహార్ లో నితీష్ కుమార్–బీజేపీ పాలనతో ప్రజలు విసిగి పోయారన్నారు. ఉద్యోగాలు లేక, వలసలు పెరిగాయన్నారు. ఇప్పుడు ఓటర్ లిస్ట్ నుంచి పేర్లు తొలగించడం వల్ల ప్రజల్లో ఆగ్రహం పెరిగిందని స్పష్టం చేశారు. ఈసారి ప్రజలు ఇండియా కూటమి వైపు చూస్తున్నారని అని ఎంపీ పేర్కొన్నారు. ప్రజల సమస్యలు విని, వాటికి పరిష్కారం చూపే ప్రభుత్వం ఒక్క ఇండియాకుటమికే సాధ్యమని ఎంపీ స్పష్టం చేశారు. అందుకే బిహార్ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని ఎంపీ కడియం కావ్య తెలిపారు.
