
వరంగల్ వాయిస్, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఏక్ దిన్. ఈ సినిమాతో స్టార్ నటి సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ- ఇస్తుండగా.. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు- చిత్రబృందం ప్రకటించింది.ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌తో పాటు- బాలీవుడ్ అగ్ర నిర్మాత మన్సూర్ ఖాన్ నిర్మిస్తున్నాడు. ఆమిర్‌ఖాన్ – మన్సూర్ ఖాన్ దాదాపు 17 ఏండ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ కలుస్తున్నారు. వీరిద్దరి కలయికలో 2008లో వచ్చిన ’జానే తూ… యా జానే నా’ చిత్రం సూపర్ హిట్‌ను అందుకుంది.