
వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన పలకల వరమ్మ ఇటీవల మరణించగా మృతురాలు మనుమలు అభిలాష్ అభినవ్ లను గ్రామ రెడ్డి సంఘం సభ్యులు వరమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆమె మృతికి భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ బాధిత కుటుంబానికి బాసటగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు మన్నెం కరుణాకర్ రెడ్డి, చల్లా మైపాల్ రెడ్డి, సభ్యులు ఏదుల్లా విజేందర్ రెడ్డి, పలకల సాంబశివరెడ్డి , మన్నెం రామ్ రెడ్డి, వెంకటరెడ్డి తిరుపతిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పలకల శ్రీనివాసరెడ్డి, రాజేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.