Warangalvoice

ఫర్టిలైజర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్లకు ఘన సన్మానం

  • గజమాలతో సత్కారం

వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాగూర్ల వెంకటేశ్వర్లకు పరకాల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నాగూర్ల వెంకటేశ్వర్లను గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరకాల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంలో ఫర్టిలైజర్ షాపు వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి బాధ్యతాయుతమైన పదవికి నాగూర్ల వెంకటేశ్వర్లు ఎన్నిక కావడం రైతు సమాజానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని, ఫర్టిలైజర్ రంగంలో ఉన్న అనుభవం సేవాభావం నాయకత్వ లక్షణాలతో నాగూర్ల వెంకటేశ్వర్లు ఈ పదవికి పూర్తిగా న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిదంగా నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతుల ఇబ్బందులు, ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ అమ్మకదారుల ఇబ్బందులు తెలుసన్నారు. అందరికీ న్యాయం జరిగేలా చేస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని తెలియజేశారు. సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అసోసియేషన్ భవన నిర్మాణానికి తన వంతు ఆర్థిక సాయం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వాడికారి శివాజీ, యర్రం లక్ష్మణ్ పరకాల ఫర్టిలైజర్ దుకాణ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *