
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
వరంగల్ వాయిస్, దామెర
దామెర మండలం నూతనంగా ఏర్పాటై దాదాపు 9 సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వ పక్క భవనాలు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుచున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని దామెర గ్రామానికి వెనుక వైపున గల ప్రభుత్వ భూమిని చదును చేసి ముళ్ళ పొదలను తొలగించి సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మండల నాయకులతో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చట అనుకూలంగా ఉంటాయని ప్రజలకు కావలసిన రవాణా ఇతర సౌకర్యాలు అన్ని కలిగి ఉండాలని వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై కొంక అశోక్
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దురిశెట్టి బిక్షపతి, నాయకులు బిల్లారమణారెడ్డి, సదిరం పోశయ్య,హరీష్, సతీష్, వినీల్, ప్రశాంత్, రవికుమార్, నితిన్ , తదితర నాయకులు పాల్గొన్నారు.