
వరంగల్ వాయిస్, దామెర:
రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని డివిజనల్ ఇంజనీర్ సౌమ్య నాయక్ అన్నారు. గురువారము మండలంలోని దామెర, తక్కలపాడు గ్రామాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పోలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సౌమ్య నాయక్ మాట్లాడుతూ…వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లకు ఎర్తింగ్ చేసుకోవాలని, దుస్తులను ఆరవేయడానికి ఇనుప తీగలను వాడరాదని అన్నారు. వర్షాకాలంలో గాలికి చెట్లు విరిగి కరెంటు తీగలపై పడినప్పుడు వాటిని ముట్టుకోకుండా విద్యుత్ సిబ్బందికి తెలుపాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ కి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించాలని తెలిపారు. కార్యక్రమంలో పరకాల ఏడిఈ దేవేందర్, స్థానిక ఏ ఈ గుర్రం రమేష్, ఎల్ఎంలు మనోహర్ గిరిబాబు,ఏఎల్ఎంలు కృష్ణ, రమేష్, రాజశేఖర్,శంకర్,ప్రభాకర్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.