Warangalvoice

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌….వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం: వ్యక్తిగత వాహనాలపై పెండింగ్‌లో వున్న ట్రాఫిక్‌ చలాన్లు వాహనదారులు చెల్లించని పక్షంలో వాహనాన్ని సీజ్‌ చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వాహనదారులకు హెచ్చరించారు.ఈ పెండింగ్‌ చలాన్లపై వరంగల్‌ పోలీస్ కమిషనర్ కొరడా ఝాలిపిస్తూ బుధవారం ఓ ప్రకటన చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజు,రోజుకి పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పాటు, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడంతో పాటు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవడంతో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అతిక్రమించి వాహనదారులు వాహనాలను నడుపతున్నారని తెలిపారు. దీనితో పోలీసులు ట్రాఫిక్‌ నిబందనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో పోలీసులు ట్రాఫిక్‌ జరిమానాలు విధించడం జరుగుతొందన్నారు.విధించిన ట్రాఫిక్‌ జరిమానాలను సైతం వాహనదారులు సకాలంలో జరిమానాలను చెల్లించకుండా అలసత్వం వహించడం ద్వారా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 1,27,194 వాహనాలపై మొత్తం 11,71,094 చలాన్లు పెండింగ్‌లో వుండగా, వీటి మొత్తం సూమారు 33 కోట్ల 28 లక్షల రూపాయల్లో మొత్తం వాహనదారులు చెల్లించాల్సి వుందని తెలిపారు. ఇందులో వరంగల్‌ ట్రాఫిక్‌ పరిధిలో 3,35,450 చలాన్లు, కాజీపేట ట్రాఫిక్‌ పరిధిలో 3,60,423, హన్మకొండ ట్రాఫిక్‌ పరిధిలో 2,73,770 చలాన్లు పెండింగ్‌లో వున్నాయని తెలిపారు. మిగితా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 2,01,451 చలాన్లు పెండింగ్‌ వున్నాయని ప్రసుత్తం జరిమానాలు చెల్లించని వాహనాల సంబంధించిన పూర్తి వివరాలు పోలీస్‌ కంప్యూటర్‌ డాటా బెస్‌లో నమోదు కాబడ్డాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లను క్లియర్‌ చేసేందుకుగాను ఇకపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక తనీఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పోలీసుల తనిఖీ సమయాల్లో పెండింగ్‌లో వున్న ట్రాఫిక్‌ చలాన్లను వాహనదారులు జమచేయాల్సి వుంటుందని అన్నారు.ఇకపై ఎవరైన పెండింగ్ చలాన్లు చెల్లించకుండా రోడ్లపై వస్తే ప్రస్తుతం నగరంలో అన్ని కూడళ్ళల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లెట్‌ రికగ్నెషన్‌ కెమెరాల అధారంగా వాహనదారుడు ప్రయాణించే మార్గంలోని పోలీస్‌ ట్యాబ్‌లకు సమాచారం వెళ్ళడం ద్వారా పోలీసులు మీ వాహనాలను రొడ్డుపై నిలిపివేసి జరిమానాలు క్లియర్‌ చేయడం జరుగుతుందని లేని పక్షంలో వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరిలించడం జరుగుతుందని అన్నారు.కావున వాహనదారులు తమ వాహనాలపై వున్న ట్రాఫిక్‌ జరిమానాలను త్వరితగతంగా చెల్లించాలని పోలీస్‌ కమిషనర్‌ వాహనదారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *