
వరంగల్ వాయిస్, దామెర : నూతన సంవత్సర వేడుకలలో నిబంధ నలు అతిక్రమించి హద్దు మీరితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని దామెర ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మండల ప్రజలు ప్రశాం తమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురికా వద్దని సూచించారు. రోడ్లపై కేకు కటిం గులు, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవ ద్దని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో డీజే సౌండ్ సిస్టంలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని, కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్ 31న రాత్రి పోలీస్ బృందాలుగా ఏర్పడి పెట్రోలింగ్ నిర్వ హిస్తామన్నారు.