
వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామర మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించి వేయడం ఉద్రిక్తలకు దారితీసింది. రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న సందర్భంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పుట్టగతులు ఉండవన్న భయంతోనే బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ మేరకు దామెర పోలీసులను పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.