Warangalvoice

దసరా సెలవుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి


వరంగల్ వాయిస్, దామెర:
దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వుండాలని ఎస్సై అశోక్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళుoడడంతో ఇండ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీయ రక్షణ కోసం మీ ఇండ్లల్లో సీసీ 5 కెమెరాలను అమర్చుకోవాలని, ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటిని, పరిసరాలను ప్రత్యక్షంగా చూసుకోవచ్చన్నారు. సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే 100కు కాల్ చేయాలని కోరారు. ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *