Warangalvoice

డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు

  • ‘బుట్ట బొమ్మ’పరిచయంతో కుటుంబంలో కలహాలు
  • మనస్థాపంతో భార్య ప్రత్యూష ఆత్మహత్య
  • నలుగురిపై కేసు నమోదు

వరంగల్ వాయిస్, హసన్ పర్తి : ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న డాక్టర్స్ కాపురంలోకి బుట్ట బొమ్మ పేరుతో మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో.. పచ్చని కాపురంలో కలహాలు రేగాయి. భర్త ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అనుమానించి భార్య.. అతనితో వాదనలకు దిగింది. అయిన ఆయనలో మార్పు కనిపించకపోవడంతో ఆత్మహత్యతో తనువు చాలించింది. ఈ దారుణం ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో చోటుచేసుకుంది. డాక్టర్ ప్రత్యూష బందువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూషకు కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లాడి సుజన్ తో 2017లో వివాహమైంది. వీరికి ఏడు సంవత్సరాల జానుషా సృజన్, ఏడు నెలల జెస్వికాస్ సృజన్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డాక్టర్ ప్రత్యూష ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో డెంటింస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ సృజన్ హంటర్ రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా డాక్టర్ సృజన్ ను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బుట్ట బొమ్మ శృతి ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియోలను రీల్స్ గా ప్రమోట్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారింది. విషయం ప్రత్యూషకు తెలియడంతో నిలదీసింది. ఈ విషమంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగినట్లు వెల్లడించారు. అయితే భార్యగా తానుండగా.. మరో యువతిని భర్త ప్రేమించడాన్ని ప్రత్యూష భరించలేకపోయింది. ఈ విషయం సృజన్ తల్లిదండ్రులకు చెప్పినా వారు పెద్దగా పట్టించుకోకపోవడం, శృతి నేరుగా ఫోన్ చేసి ప్రత్యూషను బెదిరించడంతో తట్టుకోలేక పోయింది. దీంతో మనస్థాపానికి చెందిన ప్రత్యూష (35) హసన్ పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్ లోని స్వగృహంలోనే ఊరేసుకొని ఆత్మ్యహత్యకు పాల్పడింది. ఈ మేరకు ప్రత్యూష తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా డాక్టర్ అల్లాడి సృజన్, ఆయన తల్లి దండ్రులు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతితోపాటు బుట్టబొమ్మ బానోతు శృతిలపై కేసు నమోదు చేశారు.

doctor prathyusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *