Warangalvoice

జలకళ సంతరించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు

  • మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు


వరంగల్ వాయిస్, జయశంకర్‌భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు.. పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బ్యారేజీలకు వరద తాకిడి పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో 24 గేట్లు ఎత్తి… నీటిని భారీగా దిగువకు పంపిస్తున్నారు.మేడిగడ్డ బ్యారేజీకి 60వేల530 క్యూసెక్కుల ప్రవాహం రాగా… 24 గేట్లు తెరిచి 62వేల 940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డలో 9.8 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు… పరవళ్లు తొక్కుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తు న్నాయి. పలు జిల్లాల్లో రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఈ క్రమంలోనే నేడూ, రేపూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రaార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌పై సోమవారం అల్పపీడనం ఏర్పడిరది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. నైరుతి దిశకు తిరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 13.2 సెంటీవిూటర్లు, పాతరాజంపేట(కామారెడ్డి)లో 12.8, పొచ్చెర (ఆదిలాబాద్‌)లో 10.4. నెన్నెల(మంచిర్యాల)లో 9.7, సోనాల(ఆదిలాబాద్‌)లో 9.4, జైనూర్‌(ఆసిఫాబాద్‌)లో 9.2 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌ నగరంతో పాటు సంగారెడ్డి, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 686 అడుగులకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *