
వరంగల్ వాయిస్, క్రైం : చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వారిని అరెస్ట్ చేసి నిందితుల నుండి చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నప్పుడే ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అధికారులకు సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని గురువారం కాకతీయ విశ్వవిద్యాలయము సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కేసుల పరిష్కారం కోసం అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ…ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు నిందితులు దేశంలో ఎక్కడ వున్న అరెస్టు చేసేందుకు పోలీస్ అధికారులు ప్రణాళికను రూపోందించుకోవాలని, కేసుల్లోని నిందితులను అరెస్టు చేయడంలో స్టేషన్ అధికారులు అలసత్వం వహించోద్దని, నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భాగస్వాయ్యంతో సిసి కెమెరాల ఏర్పాటుకై కృషి చేయడంతో సిసి కెమెరాల వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు .ముఖ్యంగా నిందితులకు కచ్చితంగా శిక్ష పడే రీతిలో పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నేర చరిత్ర వున్న వ్యక్తుల ప్రస్తుత స్థితిగతులపై వివరాలు అందుబాటులో వుండాలని సూచించారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్ కేసులను ట్రాఫిక్ పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్ పోలీసులు నమోదు చేయాల్సి వుంటుందని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది రోటేషన్ పద్దతిలో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని, పోలీస్ స్టేషన్లలో ఆహ్లదకరమైన వాతవరణం కోసం మొక్కల పెంపకంతో పాటు స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రంగా వుంచాలని ఇందుకోసం వారంలో ఒక రోజు శ్రమదానం చేయాల్సి వుంటుందని సిపి పోలీస్ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్‌కుమార్, వరంగల్ , జనగాం ఏఎస్పీలు శుభం, చేతన్‌నితిన్, అదనపు డిసిపిలు రవి, ప్రభాకర్‌రావు, బాలస్వామి, సురేష్‌కుమార్,తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు పాల్గోన్నారు
.

