
వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలోని దుర్గం పేట గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త గునిగంటి రాజమౌళి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి విషయాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలుసుకొని ఆయన గృహానికి వెళ్లి పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఊరుగొండ గ్రామంలో మృతి చెందిన వీసం రామచంద్రారెడ్డి కుమారుడు వీసం రమణారెడ్డిని పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకొని ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గండు రామకృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ, రఘుపతి రెడ్డి,చల్ పూరి చంద్రయ్య, నూకల వీరేశం, కూనాటి సునీల్ రెడ్డి, గండు సుదర్శన్, జన్ను సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.