
వరంగల్ వాయిస్,దామెర:
నూతన సంవత్సరంలో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఒగ్లాపూర్ గ్రామ సర్పంచ్ కేతి పెళ్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారము దామెర మండలంలోని ఓగులాపూర్ లో నూతన సంవత్సర వేడుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ నూతన సంవత్సరంలో గ్రామ ప్రజల నాయకుల సమిష్టి కృషితో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిని కొనసాగించేలా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్,ఉపసర్పంచ్ కిన్నెర దినేష్, కిన్నెర రామస్వామి, కనుకుంట్ల నరేష్, రాస మల్ల మధు, కారోబారు శ్రీను గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.