Warangalvoice

గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ


వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాఫూలే, మైనార్టీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పకుండా అమలు చేయాలని తహసీల్దార్ సూచించారు. ఈ తనిఖీలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ఆమె వెంట ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *