Warangalvoice

గణేష్ ఉత్సవ కమిటీలకు విద్యుత్ శాఖ వారి విన్నపం


వరంగల్ వాయిస్,దామెర: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  దామెరమండలంలోని అన్ని గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీలకు, యూత్ క్లబ్ నిర్వాహకులకు విద్యుత్ శాఖ సూచనలను తప్పకుండా పాటించవలెనని దామెర  ఏఈ గుర్రం రమేష్ తెలిపారు. వినాయక విగ్రహాలను తీసుకుని వచ్చేటప్పుడు తొందరపడకుండా విద్యుత్ వైర్లను మరియు కేబుల్ వైర్లను గమనించి వాహనంలోనికి ఎక్కించడం దింపడం  చేయవలెను. కేబుల్ ఆపరేటర్లు కేబుల్ వైర్లను వినాయక విగ్రహాలకు తగలకుండా పైకి కట్టవలెను. లేనిచో వాటిని తొలగించడం జరుగుతుందని తెలిపారు.
వినాయక మండపాలను విద్యుత్ వైర్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేయరాదని అన్నారు. మండపంలోని విద్యుత్ సౌకర్యం కొరకు ఎన్సీబీ కరెంటు వైర్లను వాడవలెను ఇన్సులేటెడ్ కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ వారి అనుమతితో విద్యుత్ సిబ్బంది ద్వారా పోలుపైన చుట్టించుకోవాలని కొండ్లు వేయరాదని తెలిపారు. వినాయక మండపాలను వీలైనంతవరకు వెదురు కర్రలతో నిర్మించుకోవాలని ఇనుప పైపులను వాడరాదని సూచించారు.విద్యుత్ వైర్లను నేలపై వేయరాలని స్విచ్ బోర్డులను ప్లగ్గులను తడి చేతులతో తాకరాదని తెలిపారు. పిల్లలకు అందనంత ఎత్తులో బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నిర్వాకులు ప్రమాదాలు జరగకుండా విద్యుత్ వాడుకొని ఉత్సవాలను సంతోషంగా జరుపుకొని విద్యుత్ శాఖ వారికి సహకరించగలరని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *