వరంగల్ వాయిస్, దామెర:
రైతులు ఆరుగాలం పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధరను పొందాలని ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీవో గుమ్మడి కల్పన అన్నారు. శనివారము దామెర మండలంలోని సింగరాజు పల్లి లో ఐకె పి ఆధ్వర్యంలో సిరి మహిళ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏవో రాకేష్, సిరి మహిళా సంఘం సభ్యులు స్వరూప, సుజాత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి, పోలే పాక శ్రీనివాస్, దురిశెట్టి బిక్షపతి,దుబాసి రాజేందర్,పోషిని మహేందర్, కచ్చకాయల అరుణ రవీందర్ తదితర గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.