
- డోర్నకల్ లో నిలిపివేత
వరంగల్ వాయిస్, డోర్నకల్ : తిరుపతి నుంచి అదిలాబాద్ వెళ్తున్న కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో శనివారం సాయంత్రం పొగలు రావడంతో దానికి డోర్నకల్ రైల్వేస్టేషన్ లో నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. రైలు నుంచి ప్రయాణికులు హుటాహుటిన దిగిపోయారు. రైలులోని ఎస్-1 భోగి చక్రాల నుంచి పొగలు రావడాన్ని గమనించిన రైలు గాడ్ డ్రైవర్ ని అప్రమత్తం చేశారు. దీంతో రైలును డోర్నకల్ రైల్వే స్టేషన్ లోని ఒకటో నెంబర్ ఫ్లట్ ఫాంపై నిలిపివేశారు. టీఎక్స్ఆర్ డిపార్ట్ మెంట్ వాళ్ళు రైల్వే చక్రాలను పరిశీలించి బ్రేకులు పట్టేయడంద్వారా పొగలు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. చక్రాలను పట్టేసిన బ్రేక్ ప్లేట్స్ తిరిగి వెనక్కి రాకపోవడంతో రాపిడి జరిగి వాసనతో కూడిన పొగ వచ్చిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి రైలును పంపించి వేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.