Warangalvoice

కిలాడీ దంపతుల అరెస్ట్‌

  • రూ.11.80లక్షల నగదు, 125 గ్రాముల బంగారం, కారు స్వాధీనం
  • వెల్లడిరచిన పోలీస్‌ కమిషనర్‌ డా.తరుణ్‌ జోషి

వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ క్రైం : అవసరాల కోసమని కాలనీ వాసులను మోసం చేసి వారి నుంచి డబ్బు, బంగారం తీసుకొని ఉడాయించిన కిలాడీ దంపతులను టాస్క్‌ ఫోర్స్‌, కేయూసి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీరినుంచి రూ.11.80లక్షల నగదు, 125 గ్రాముల బంగారు అభరణాలతోపాటు ఒక ఖరీదైన కారు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.తరుణ్‌ జోషి వివరాలను వెల్లడిరచారు. కొమళ్ళ కిషోర్‌, కొమళ్ళ దివ్య దంపతులు హనుమకొండలోని పరిమళకాలనీలో నివాసం ఉంటూ చిరు వ్యాపారం నిర్వహిస్తుండేవారు. ఈ వ్యాపారంలో వారికి లాభాలు రాకపోవడంతో సులభంగా పెద్ద మొత్తం డబ్బు సంపాదించాలనుకున్నారు. తమ ప్రణాళికలో భాగంగా ముందుగా కాలనీవాసులనుంచి వ్యక్తిగత అవసరాల నిమిత్తం చిన్న మొత్తాల్లో అప్పులు, బంగారాన్ని తీసుకొని ప్రతి ఫలంగా వారికి అధిక మొత్తంలో వడ్డీ చెల్లించేవారు. కాలనీవాసులకు వీరిపై నమ్మకం కలిగించే విధంగా తీసుకున్న డబ్బుకు రెండిరతలు చెల్లిస్తూ అందరినీ నమ్మించారు. తమ ప్రణాళికలో భాగంగా కొమళ్ళ దివ్య తనకు అత్యవసరంగా బైపాస్‌ సర్జరీ చేయుంచాలని, లేదంటే తన ప్రాణానికే ప్రమాదమని కాలనీలోని మహిళలను నమ్మించి చికిత్స కోసం డబ్బు, బంగారం ఇచ్చేవారికి అధిక వడ్డీని అందజేస్తాని తెలియజేశారు. దీంతో కాలనీలోని ఆరుగురు మహిళలు దివ్య మాటలు నమ్మి సుమారు రూ.43.40లక్షలతో పాటు 430 గ్రాముల బంగారు ఆభరణాలను దంపతులకిచ్చారు. ఈ మొత్తంలో దివ్య దంపతులు కాలనీ నుంచి ఉడాయించారు. ఎన్ని రోజులైనా వారు తిరిగి రాకపోవడంతోపాటు వారి ఫోన్‌ కుడా స్వీస్‌ఆఫ్‌ కావడంతో తాము మోసపోయామని గుర్తించారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు నిందితులపై కేయూసీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌, కేయూసీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని వినియోగించుకోని కిలాడీ దంపతులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా ఈ దంపతలకు సహకరించిన మరో ఇద్దరు మహిళలు అరుణ, మంజుల ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీస్‌ కమిషనర్‌ వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *