
దామెరలో లేబర్ కార్డుదారులకు రక్త పరీక్షలు
హెల్త్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్
వరంగల్ వాయిస్, దామెర : కార్మికుల సంక్షేమం మరియు వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా దామెర మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. లేబర్ కార్డు కలిగిన కార్మికులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి, అనంతరం వారికి హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దామెర గ్రామ సర్పంచ్ గారిగే కల్పనా కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ బత్తిని రాజు యాదవ్ మాట్లాడుతూ.. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆరోగ్య సదుపాయాలను ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో వార్డు సభ్యులు వేల్పుల ప్రసాద్, మీరల రవి, మంతుర్తి రాకేష్, అశోద రవేందర్, బోడ శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే నాయకులు సోనాబోయిన రాజు, సింగారబోయిన బుచ్చన్న, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.