
వరంగల్ వాయిస్,దామెర: దామెర మండల కేంద్రానికి చెందిన కొక్కుల ఓం ప్రకాష్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొచ్చు చందర్ నియామక ఉత్తర్వులు అందించారు కొక్కుల ఓం ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పార్టీ ఎదుగుదలకు చేసిన సేవలను గుర్తించి నియామక ఉత్తర్వులను అందించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మాట్లాడుతూ సేవాదళ్ మండల అధ్యక్షుడిగా నాపై నమ్మకంతో పార్టీ బాధ్యతలను అప్పగించడం పట్ల మరింత ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు తన నియామకానికి సహకరించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా చైర్మన్ డిసిసి హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెంకట్రాంరెడ్డికి దామర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి టిపిసిసి ఎస్సి సేల్ స్టేట్ కన్వీనర్ దళితరత్న అవార్డు గ్రహీత కోర్నెల్ మరియు సర్పంచ్ పోలేపాక శ్రీనివాస్ సమన్వయ కమిటీ సభ్యులు కూనమల రవీందర్ దుర్గంపేట సర్పంచ్ దాసి శ్రీకాంత్ పుచ్చకాయల నరసింహారెడ్డి ఆవాల రవీందర్ ఈశ్వర్ తదితర నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.