
దామెర ఎంపీడీవో కల్పన
వరంగల్ వాయిస్, దామెర : రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణపై శుక్రవారం దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో పీఓ (ప్రిసైడింగ్ ఆఫీసర్లు), ఏపీఓలకు (అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గుమ్మడి కల్పన మాట్లాడుతూ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. అనంతరం జరిగిన పోలింగ్ ఆఫీసర్ల శిక్షణ సమావేశంలో, నామినేషన్ల ఫారాల పరిశీలన, పూరింపు తదితర ముఖ్య విషయాలను శిక్షకులు క్షుణ్ణంగా వివరించారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల విషయంలో, వాటికి గల కారణాలను స్పష్టంగా వివరించాలని శిక్షకులు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన విధంగానే అధికారులు తమ విధులను నిర్వహించాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ రంగాచారి, ప్రొసీడింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.