
వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఊరుగొండలోని పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యూరియా నిల్వలు, అమ్మకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవీందర్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రాకేష్, కమలాకర్, అరుణ్, జగదీష్, రామకృష్ణ, సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
