
వరంగల్ వాయిస్,దామెర:
దామెర మండలంలోని వివిధ శాఖలలో పని చేస్తు జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా 77వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వారికి అవార్డులు పొందిన ఎంపీడీవో గుమ్మడి కల్పన,మిషన్ భగీరథ ఏఈ నూనె వెంకటేష్,దామెర గ్రామపంచాయతీ కార్యదర్శి మనోహర్, హనుమకొండ జిల్లాలో ఉత్తమ ఉద్యోగులుగా జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గుమ్మడి కల్పన మాట్లాడుతూ అవార్డు పొందడం ఆనందంగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవలను అందించడంలో మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.