
వరంగల్ వాయిస్, హనుమకొండ :పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ నందు రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ ఎం ప్రశాంతి ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి లో ఉత్తమ అధ్యాపకురాలిగా కాకతీయ యూనివర్సిటీ పరిధి నుండి మొదటి స్థానంలో ఎంపిక అయ్యారు. వీరి విద్యాభ్యాసం మొత్తము కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగినది. మీరు 2005లో పీహెచ్డీ పూర్తి చేసుకున్నారు. డాక్టర్ ఎం ప్రశాంతి 2004 పీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరర్ గా నియమితులయ్యారు. 2010 లో డిగ్రీ అధ్యాపకురాలిగా ప్రమోషన్ పొందారు. వీరు మొదట ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాల నందు పనిచేశారు. ఆ తరువాత కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాల నందు పనిచేశారు ప్రస్తుతము పింగిలి మహిళా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పని చేసినప్పుడు వీరు రసాయన శాస్త్ర విభాగపు అధిపతిగా వ్యవహరించారు. ప్రస్తుతము పింగిలి మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ లో రీసెర్చ్ కమిటీ అధిపతిగా మరియు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అధిపతిగా ఉన్నారు. ఈ కమిటీల అధిపతిగా వీరు విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. వీరు మొత్తం 22 పేపర్లను జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురించారు. వీరు మూడు పుస్తకాలను మరియు రెండు పేటెంట్లను కలిగి ఉన్నారు. మీరు ఎన్నో జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పేపర్లను ప్రెసెంట్ చేశారు.వీరు కన్వీనర్ గా మరియు కో కన్వీనర్ గా ఎన్నో సెమినార్లను, వర్క్ షాప్ లను నిర్వహించారు. వీరు సృజనాత్మక మరియు డిజిటల్ పద్ధతుల ద్వారా విద్యార్థులలో రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి పెరిగేలా బోధన చేస్తున్నారు. ఈ భాగంలోనే వీరికి 2022- 2023 సంవత్సరానికి గాను వీరి మార్గదర్శకత్వంలో విద్యార్థులకు జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులలో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి లభించింది. విద్యార్థుల పట్లనే కాకుండా వీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.
వీరిని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి చంద్రమౌళి, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందించారు