
ఆదివారం కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వివిధ రూపాల్లో కొలువై ఉన్న అమ్మవారికి శ్రావణమాసం తొలి ఆదివారం కుమ్మర్లు తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ అమ్మ ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా ఉండాలని, ఆ తల్లి చల్లని చూపులు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ అమ్మకు బోనం సమర్పిస్తారని తెలంగాణ కుమ్మర్ల సంఘం, రాష్ట్ర అధ్యక్షులు బీసీ ఐక్య చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆకారపు మోహన్ అన్నారు. అయితే అమ్మవారికి కుండలోనే బోనం తీసుకురావడం ద్వారా అమ్మ ఆశీస్సులు శీఘ్రంగా లభిస్తాయన్నారు. పోచమ్మ మైదాన్ లోని శ్రీ పోచమ్మ తల్లి కనకదుర్గమ్మ దేవాలయంలో ఆదివారం కుమ్మర భక్తమండలి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.