
వరంగల్ వాయిస్, శాయంపేట : అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది అని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. మండలంలోని నర్సింహులపల్లె గ్రామంలో చెన్నకేశవర స్వామి గుడిలో గణపత ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని, వినాయకుడి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు,శ్రీకాంత్ రాజు,కృష్ణ,రాజేందర్, నాగరాజు, కర్ణాకర్,రవీందర్, రత్నాకర్, నాగరాజు, నరేందర్,రాజు, కృష్ణ శ్రీను, చంద్రమౌళి,సురేందర్, కృష్ణ , లింగమూర్తి, బిక్షపతి మల్లయ్య, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.