
- కలెక్టర్ డాక్టర్ సత్య శారద
- ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన
వరంగల్ వాయిస్, వరంగల్ : అధిక జనాభాతో అనేక సమస్యలు ఉద్భవిస్తాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. జనాభా పెరుగుదలతో కలిగే సమస్యలు..సమాజంపై దాని ప్రభావాన్ని తెలియజేసే లక్ష్యంతో ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని జనాభా పెరుగుదలతో కలిగే సమస్యలపై అవగాహన కల్పించారు. పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా విస్పోటనం జరుగుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరి కొన్ని సంవత్సరాలు తర్వాత భూమి మీద నివసించేందుకు చోటు లభించదన్నారు. అందుకు కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం తదితర అంశాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రపంచ జనాభా దినోత్సవం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.