Warangalvoice

అది మానేసినాకే బరువు తగ్గా

  • నటి విద్యాబాలన్‌ ఆరోగ్య సీక్రెట్‌
  • డైట్‌ ప్లాన్‌ అనుసరించి బరువు తగ్గా

వరంగల్ వాయిస్, సినిమా: ప్రతి ఒక్క హీరోయిన్‌ శరీర ఆకృతి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా కనిపించడం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్కౌంట్‌లు చేస్తారు. అయితే బరువు తగ్గాలంటే జిమ్‌, వ్యాయామం, కఠినమైన డైట్‌లు తప్పనిసరి అన్న భావనకు బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ ఓ కొత్త కోణాన్ని చూపించారు. 46 ఏళ్ల విద్యా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశ మవుతున్నాయి. కెరీర్‌ ఆరంభం నుంచి తన శరీర తీరుపై విమర్శలు ఎదుర్కొన్న విద్యా, ఎన్నో డైట్‌లు, జిమ్‌ సెషన్లు -టై చేసినా అవి తాత్కాలిక ఫలితాలే ఇచ్చాయని గుర్తుచేశారు. కానీ ఆమె అసలు మార్పు మాత్రం జిమ్‌ మానేశాకే వచ్చిందని వెల్లడిరచారు. ’నాకు బరువు పెరగడానికి అసలు కారణం కొవ్వు కాదు. అది ఇన్‌ప్లమేషన్‌ (శరీరంలోని వాపు) అని చెన్నైకి చెందిన ’అముర’ అనే న్యూట్రిషన్‌ గ్రూప్‌ చెప్పారు. ఆ సంస్థ సూచించిన విశిష్టమైన డైట్‌ ప్లాన్‌ అనుసరించడంతో, బరువు క్రమంగా తగ్గిపోయింది. అంతేకాదు, ఈ డైట్‌తోపాటు- నన్ను ఏడాది పాటు వ్యాయామం చేయొద్దని సూచించారు. నేను వర్కౌట్‌ చేయకుండా,
జిమ్‌కి కూడా వెళ్లకుండా బరువు తగ్గాను. ఇప్పుడు ఎవరైనా నన్ను చూస్తే.. ఎంత స్లిమ్‌ అయిపోయావ్‌ అంటు-న్నారు. నేను పాటించిన డైట్‌ విధానం అందరికీ సరిపోదు. ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటు-ంది. అందుకే శరీర అవసరాలు గౌరవించాలి’ అంటూ తన అనుభవాన్ని పంచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *