
వరంగల్ వాయిస్, దామెర:
జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాల హనుమకొండ యూనిట్ వన్, యూనిట్ టు ఆధ్వర్యంలో దామెర గ్రామంలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి హాజరై ప్రారంభించి మాట్లాడుతూ జాతీయ సేవా పథకం నిర్వహించే శిబిరాల ద్వారా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు నైపుణ్యాల అభివృద్ధి కి దోహాదపడుతుందని అన్నారు. దామెర గ్రామాన్ని ఎంచుకొని సమాజసేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు అభినందించారు. ఎంపీడీవో కల్పన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న రుక్మతలను రూపుమాపడానికి ముందుకు రావడం గర్వనీయం అన్నారు.ఏడు రోజులు గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక అంశాల పట్ల అవగాహన చేసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజేష్ కుమార్,ఎంపీ ఓ రంగాచారి, ప్రోగ్రాం ఆఫీసర్స్ ఎస్ శ్రీనివాస్, ఆర్ ప్రవీణ్ కుమార్,గ్రామపంచాయతీ కార్యదర్శి మనోహర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.