Warangalvoice

Enugula Rakesh Reddy

నాకు మీరు రక్ష – మీకు నేను రక్ష

  • మనమంతా ఈ దేశానికి, ధర్మానికి రక్ష
  • బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి

వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: ‘తోబుట్టువులు లేని నాకు మీ ప్రేమానురాగాలు ఆప్యాయతలు నన్ను కట్టిపడేశాయి..’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి 11వ డివిజన్ పోతననగర్ కాలనీ మహిళలను కొనియాడారు. గురువారం ఆయనకు పలువురు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. మనసా వాచా అందరికీ అన్నలా అండగా ఉంటానన్నారు. రక్షా బంధన్ బంధానికి కులమతాలు అడ్డుకాదన్నారు. రక్షా బంధన్ అంటే ఒకరికి ఒకరు రక్షణగా ఉండాలని, నాకు నువ్వు రక్షా నీకు నేను రక్షా.. మనమంతా ఈ దేశానికి ధర్మానికి రక్ష అన్నది మాకు చిన్నప్పటి నుంచి సంఘ్ శాఖలో నేర్పిందన్నారు. ప్రధాని మోడీకి పాకిస్తాన్ నుంచి ఒక ఆడపడుచు ప్రతీ ఏడూ రాఖీ కడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *