- మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు.
వరంగల్ వాయిస్, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు. ఇందులో భంగా మహబూబ్‌నగర్ విద్యానిధిని ఏర్పాటు చేశామని, సామాజిక స్పృహ కలిగిన వారు సహకరించాలన్నారు. పట్టణంలోని బీఈడీ కాలేజీలో నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలేజీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మన కళాశాలను, పాఠశాలలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి వీలైనంతవరకు సౌకర్యాలు కల్పించాలని అది మనందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ కళాశాల అతి పురాతనమైనదని అందుకే త్వరలో కళాశాలలకు పూర్తిస్థాయిలో నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు అందించమని కళాశాల సిబ్బందికి సూచించారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఒక్క వ్యక్తితో అది సాధ్యం కాదు కాబట్టి , ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన ఆదేశించారు. అందుకే మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటు చేశామని బాధ్యత కలిగిన పౌరులు సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విద్యానిధికి సహకరించాలని చేయూత అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ విద్యా నిధి పారదర్శకంగా అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి నెల తన జీతం నుంచి లక్ష రూపాయలు విద్యానిధిలో జమ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం గోవిందరాజులు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, రాజు గౌడ్, మోయీజ్, ప్రవీణ్ కుమార్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
