Warangalvoice

Yadadri Mahakumbhabhishekam Celebrations

Yadadri: 23న లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం

  • యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.

వరంగల్ వాయిస్, యాదాద్రి : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (Sri Lakshmi Narasimha Swamy temple)లో బుధవారం (19వ తేదీ) నుంచి 23 వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు (Mahakumbhabhishekam Celebrations) జరగనున్నాయి. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 7.45 గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, అఖండ దీప ప్రజ్వలన, అంకురార్పణ, ద్వార తోరణం ధ్వజ కుంభారాధన, అంకురార్పణ హోమం జరుగుతుంది. ఐదు రోజుల పాటు వానమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 108 మంది ఋత్వికులతో పంచకుండాత్మక యాగం జరుగుతుంది. కాగా 23వ తేదీ వరకు ఆలయంలో భక్తులచే జరిపే సుదర్శన నరసింహ హోమం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి. ఈ సంప్రోక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం 11.54 గంటలకు సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠామహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. కాగా గోపురానికి బంగారం తాపడం అమర్చే పనులు పూర్తి అయ్యాయి. తాపడం అమర్చే పనులకు మొత్తం 60 కిలోలకు పైగా బంగారాన్ని వినియోగించారు. సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు హాజరుకానున్నారు.

Yadadri Mahakumbhabhishekam Celebrations
Yadadri Mahakumbhabhishekam Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *